సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (20:54 IST)

13-06-2021 నుంచి 19-06-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఒత్తిడి అధికం. వ్యవహారాలతో తీరిక ఉండదు. గురు, శుక్రవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ప్రియతముల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏ సంబంధం కలిసిరాక నిస్తేజానికి లోనవుతారు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నోటీసులు అందుకుంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు అదనపు బాధ్యతలు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అనుకూలతలున్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. పెద్దల సలహా పాటిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించండి. ఖర్చులు అదుపులో ఉండవు. రావలసిన ధనంపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. శనివారం నాడు అపరిచితులతో జాగ్రత్త. వాగ్వివాదాలకు దిగవద్దు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లౌక్యంగా వ్యవహరించాలి. భేషజాలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. సాధ్యం కానీ హామీలివ్వవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల సాయంతో  ఒక సమస్య సద్దుమణుగుతుంది. గృహమార్పు అనివార్యం. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఆత్మస్థైర్యంతో మెలగండి. అవివాహితులకు నిరుత్సాహకరం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు ఆశాజనకం. వేడుకలు, వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ సాయం పొందిన వారే విమర్శిస్తారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఓర్పుతో వ్యవహరించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఏ విషయాన్ని తీవ్రంగా తీసుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు హోదా మార్పు స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం వ్యవహారానుకూలత వుంది. బంధుమిత్రులు చేరువవుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు సానుకూలమవుతాయి. పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహమార్పు కలిసివస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు పదవీ యోగం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. చేతివృత్తుల వారికి ఆశాజనకం. ప్రయాణం ఆలోచన విరమించుకుంటారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం. ఆదాయానికి లోటుండదు. సన్నిహితులను ఆదుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. మంగళ, బుధవారాల్లో వ్యక్తులతో జాగ్రత్త. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. గృహమార్పులు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విద్యాసంస్థలకు ఆశాజనకం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు కష్టకాలం. స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. వ్యవహారాలు బెడసికొడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. స్థిమితంగా ఉండేందుకు యత్నించండి. ఆది, మంగళవారాల్లో ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆప్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆటంకాలెదురైనా పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు విపరీతం. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. బుధ, గురువారాల్లో ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. నిరుద్యోగులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. విదేశీయాన యత్నాలు విరమించుకుంటారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. మానసికంగా కుదుటపడతారు. శుక్ర, శనివారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. కార్మికులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
శ్రమించినా ఫలితం వుండదు. మీ సమర్థత అవతలివారికి కలిసివస్తుంది. మనశ్శాంతి లోపిస్తుంది. అన్యమస్కంగా గడుపుతారు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ఆదివారం నాడు పనులు సాగవు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకోండి. అతిగా ఆలోచించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో సమస్యలు సర్దుకుంటాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఇట్టి విషయాలపై శ్రద్ధ వహించండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు అనుకూలిస్తాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. సోమ, మంగళ వారాల్లో ఖర్చులు విపరీతం. పొదుపు ధనం అందుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. సేవా, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అవకాశాలు కలిసివస్తాయి. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు తగిన సమయం. బాధ్యతగా వ్యవహరించాలి. సాధ్యం కానీ హామీలివ్వవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. గురు, శనివారాల్లో అపరిచితులతో జాగ్రత్త. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. అవివాహితులకు శుభయోగం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.