విక్రమ్ 'సామి-2'కు కోటి వ్యూస్.. యూట్యూబ్ షేక్

తమిళ హీరో చియాన్ విక్రమ్ తాజా చిత్రం "సామి-2". గతంలో వచ్చిన 'సామి' చిత్రానికిది సీక్వెల్. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పక్కా మాస్ఎంటర్‍టైనర్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవలే ప్రేక్ష

saamy movie still
pnr| Last Updated: సోమవారం, 11 జూన్ 2018 (17:29 IST)
తమిళ హీరో చియాన్ విక్రమ్ తాజా చిత్రం "సామి-2". గతంలో వచ్చిన 'సామి' చిత్రానికిది సీక్వెల్. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పక్కా మాస్ఎంటర్‍టైనర్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 
విక్రమ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు హరి తనదైనశైలిలో రూపొందించిన ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఫలితంగా 'సామి 2' ట్రైలర్‌కు యూట్యూబ్‌లో కోటి వ్యూస్ వచ్చాయి. అలాగే, 1.90 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈమధ్యకాలంలో ఇన్ని వ్యూస్ వచ్చిన ట్రైలర్ ఇదే కావడం గమనార్హం. 
 
కాగా, ఈ చిత్రంలో హీరో విక్రమ్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలను సమకూర్చుతుండటం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రయూనిట్ ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి. 

 దీనిపై మరింత చదవండి :