శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 జులై 2018 (14:54 IST)

మమ్ముట్టి అమ్మాయిగా పుట్టివుంటే రేప్ చేసేవాడిని.. ఎవరు? (Trailer)

తాను యువకుడిగా వుండి... మమ్ముట్టి అమ్మాయిగా పుట్టివుంటే.. ఆయనను తాను అత్యాచారం చేసివుండేవాడినని.. తమిళ దర్శకుడు మిస్కిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ తాను అభ్యంతరకరంగా మాట్లాడుతున్నానని ఎవరూ భావి

తాను యువకుడిగా వుండి... మమ్ముట్టి అమ్మాయిగా పుట్టివుంటే.. ఆయనను తాను అత్యాచారం చేసివుండేవాడినని.. తమిళ దర్శకుడు మిస్కిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ తాను అభ్యంతరకరంగా మాట్లాడుతున్నానని ఎవరూ భావించవద్దని.. మమ్ముట్టి నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పేందుకే.. ఇలా మాట్లాడానని తెలిపారు. 
 
మమ్ముట్టి నటించిన పెరాన్బు టీజర్‌ను చెన్నైలో విడుదల చేసిన సందర్భంగా మిస్కిన్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మమ్ముట్టి అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. ఈ సినిమాలో మమ్ముట్టి కాకుండా మరెవరు నటించినా బాగుండేది కాదని.. ఇదే పాత్రను మరొకరికి ఇస్తే.. ఓవరాక్షన్ చేసివుండేవారన్నారు. 
 
అయితే మమ్ముట్టిపై రేప్ వ్యాఖ్యలు చేసిన దర్శకుడు మిస్కిన్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. సూపర్‌‌స్టార్‌ను మెచ్చుకునేందుకు ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదని సలహా ఇస్తున్నారు. దర్శకుడిగా వుండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.