గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్

ఏంరా వదిలేస్తావా నన్నూ? : ఆలరిస్తున్న 'లవ్‌స్టోరి' డైలాగ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్‌స్టోరి. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం టీజర్‌ను ఆదివారం ఉదయం విడుదల చేశారు. "ఏంరా వ‌దిలేస్తావా న‌న్నూ?" అంటూ సాయి ప‌ల్ల‌వి చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది.
 
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి గతంలో నటించిన చిత్రం ఫిదా. ఈ మూవీ సూపర్ డూపర్‌ హిట్‌ కొట్టింది. సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించడమే కాకుండా, ఆ యాసలో అద్భుతంగా మాట్లాడి, ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందింది. 
 
ఇపుడు తాజాగా నిర్మించిన లవ్‌స్టోరిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ‘ఏయ్‌ పిల్లా’ అనే పాట విడుద‌లైంది. ఆ పాట‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందించారు. ఆ టీజర్‌ను మీరూ చూడండి.