మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (16:13 IST)

'మహాకాళేశ్వరుడు'గా అక్షయ్ ఖాన్ - "ఓ మై గాడ్-2" టీజర్ రిలీజ్

omg teaser
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మహాకాళేశ్వరుడిగా కనిపించనున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 'ఓ మై గాడ్-2' చిత్రం టీజర్‌‍ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఉజ్జయిని మహాకాళేశ్వరుడుగా కనిపించనున్నారు. 
 
తాజాగా ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అక్షయ్ కుమార్ - అశ్విన్ వర్దే కలిసి నిర్మించిన ఈ సినిమాకి అమిత్ రాయ్ దర్శకత్వం వహించాడు. "ఓ మై గాడ్‌"లో పరేశ్ రావల్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తే ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. కొంతసేపటికి క్రితం ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. 
 
"ఈశ్వరుడికి ఆస్తికుడి.. నాస్తికుడు అనే భేదం లేదు. ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. శరణాగతి చేసినవారిని తప్పక రక్షిస్తాడు" అనే కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందించినట్టుగా తెలుస్తుంది. యామీ గౌతమ్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, ఆగస్టు 11వ తేదీన విడుదలకానుంది.