శుక్రవారం, 12 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By దేవీ
Last Updated : గురువారం, 11 సెప్టెంబరు 2025 (17:11 IST)

Rasi kanna: శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలతో లవ్ యు2 అంటున్న సిద్ధు జొన్నలగడ్డ

Sidhu Jonnalagadda, Srinidhi Shetty and Raashi Khanna
Sidhu Jonnalagadda, Srinidhi Shetty and Raashi Khanna
నచ్చిన అమ్మాయి జీవితంలోకి ప్రవేశిస్తే లైఫే బెటర్ అనుకున్న యువకుడి జీవితంలో ఇద్దరు ప్రవేశిస్తే ఏమయింది? అనే పాయింట్ తో తెలుసుగదా చిత్రం రూపొందింది. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా, సిద్ధు జొన్నలగడ్డ ప్రేమికులుగా నటించిన ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. ట్రైయాంగిల్ ప్రేమకథను ప్రజెంట్ చేసింది.  టైటిల్ కు లవ్ యు2 అనే ట్యాగ్‌లైన్ మరింత క్యూరిరియాసిటీని పెంచింది. హ్యాపీ నెస్, లవ్, కాన్ఫ్లిక్ట్, ఎమోషనల్ మూమెంట్స్ తో టీజర్ సాగుతుంది.
 
మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అక్టోబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం దాని ప్రోమోలతో చాలా బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్  సింగిల్ మల్లికా గంధ మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది. నీరజ కోన నెరటివ్ ని చాలా మెచ్యూర్ గా ప్రజెంట్ చేశారు. ఫన్,  డ్రామా అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యాయి.
 
సిద్ధు జొన్నలగడ్డ డిజే టిల్లు పాత్రకు భిన్నంగా న్యూ ఛార్మింగ్ అవతార్ లో కనిపించారు. చాలా స్టైలిష్‌గా ఆకట్టుకున్నారు. ఇద్దరు హీరోయిన్స్ తో కెమిస్ట్రీ చాలా కొత్తగా వుంది. రాశి ఖన్నా ట్రెడిషినల్ మోడరన్ లుక్స్‌లో కనిపిస్తుంది. శ్రీనిధి శెట్టి పాత్ర కూడా కట్టిపడేసింది. ఇద్దరూ సిద్ధుతో లవ్ మూమెంట్స్ షేర్ చేసుకున్నారు. సిద్ధు ఫ్రెండ్ గా వైవా హర్ష తనదనై హ్యుమర్ తో ఆకట్టుకున్నాడు,
 
టీజర్ లో  విజువల్స్‌ అద్భుతంగా వున్నాయి. జ్ఞాన శేఖర్ VS అద్భుతమైన సినిమాటోగ్రఫీ వుంది. ఎస్ థమన్ మ్యూజిక్ న్యూ ఏజ్ లవ్ స్టొరీ మూడ్‌ ని సెట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి.
 
టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతుంది. యూత్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా ఉండే రొమాంటిక్‌ డ్రామాను ఫ్రెష్ నరేటివ్ లవ్‌ ట్రయాంగిల్‌ టచ్‌తో చూపించబోతుందనే హింట్‌ ఇస్తోంది. స్ట్రాంగ్‌ క్యాస్ట్‌, స్టైలిష్‌ విజువల్స్‌, అద్భుతమైన మ్యూజిక్‌ వస్తున్న తెలుసు కదా మోస్ట్ ఎవైటెడ్ మూవీగా మారింది.