గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (20:20 IST)

టీ కోసం వ్యానును ఆపిన పోలీసులు.. పారిపోయిన దొంగలు

Police Van
Police Van
యూపీలోని ఝాన్సీ జిల్లాలో పోలీసులకు దొంగలు చుక్కలు చూపించారు. టీ తాగుదామని ఏమరుపాటుగా వ్యవహరించడంతో ముగ్గురు దొంగలు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. ముగ్గురు దొంగలతో పోలీసులు కోర్టుకు వ్యానులో వెళ్తున్నారు. మార్గమధ్యంలో పోలీసులు టీ కోసం వ్యానును ఆపారు. ఆ సమయంలో వాహనం తలుపులు లాక్ చేయడం మర్చిపోయారు పోలీసులు. 
 
ఈ క్రమంలో వ్యానులోని ముగ్గురు నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.