మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By శ్రీ
Last Modified: శనివారం, 13 జులై 2019 (13:32 IST)

ఆ టీచర్‌కు రూ. 10 కోట్లు ఆస్తి ఉన్న పెళ్లికూతురు కావాలట...

వివాహ సంబంధాల కోసం మాట్రిమోనియాలు, పేపర్లో ప్రకటనలు నిత్యం చూస్తూ ఉంటాం. అమ్మాయిలు-అబ్బాయిలు తమకు నచ్చిన వ్యక్తులను, అర్హతలు ఉన్న వారిని జీవత భాగస్వాములను ఎన్నుకునే  అవకాశాలు ఇప్పుడు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వధువు కోసం పత్రికల్లో ప్రకటన ఇచ్చిన పశ్చిమ బెంగాల్ లోని సిలిగుడికి చెందిన ఓ టీచర్ వార్తల్లో చక్కర్లు కొడుతున్నాడు. 
 
ఇంతకీ విషయం ఏంటంటే తాను ఇచ్చిన ప్రకటనలో వధువుకు 10 కోట్ల ఆస్తి ఉండాలని అందులో షరతు పెట్టాడు. 42 సంవత్సారాల వయస్సు ఉన్న సదరు వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అతను పేరు మాత్రం ఎక్కడ చెప్పకుండా కేవలం ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చాడు. ఈ విచిత్ర ప్రకటన ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ ప్రకటన ఎవరు ఇచ్చారు అనే వివరాలు తెలియరాలేదు. 
 
ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఈ ప్రకటనపై మండిపడుతున్నాయి. ఒక పక్క వరకట్న నిర్మూలన కోసం ప్రయత్నాలు జరుగుతుంటే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇలా ప్రకటించడం విస్మయానికి గురయ్యామని తెలియజేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ఏది ఏమైనా ఈ ప్రకటనకు నెటిజన్లు అనేక మీమ్స్ సృష్టిస్తున్నారు. మరి ఆ సదరు టీచర్ ఎక్కడుంటాడో ఏంటో.. మరి అతగాడికి వధువు దొరుకుతుందో లేదో.. చూద్దాం.