గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (15:22 IST)

మహానటి సావిత్రి గెటప్‌లో సినీనటి రోజా.. ఎలా వుందంటే?

మహానటి సావిత్రి గెటప్‌లో సినీనటి రోజా కనిపించారు. తన సినీ కెరీర్‌లో విభిన్న రోల్స్ పోషించి మెప్పించిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో వున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

మహానటి సావిత్రి గెటప్‌లో సినీనటి రోజా కనిపించారు. తన సినీ కెరీర్‌లో విభిన్న రోల్స్ పోషించి మెప్పించిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో వున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే రోజా ఇటీవల ఫారిన్ ట్రిప్ ఫోటోలను పోస్టు చేశారు. తాజాగా మరో గెటప్‌లో తళుక్కుమన్నారు. 
 
అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ''మహానటి'' ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. రోజా సావిత్రి గెటప్‌లో కనిపించారు. ఈ సందర్భంగా మహిళల గొప్పదనాన్ని చాటి చెప్పేలా సందేశాత్మకంగా ఓ కామెంట్ పెట్టారు. నిజమైన మహిళలు అత్యున్నతంగా, శక్తిమంతంగా, స్వత్రంత్ర భావాలతో ప్రేమగా, నమ్మకంగా వుంటారని పోస్టు చేశారు.
 
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రెస్ కర్టసీ మదురాస్ డిజైనర్ స్టూడియో, జ్యుయెల్లరీ సిల్వర్ క్రావింగ్స్ జ్యుయెల్లరీ, పీసీ కల్యాణ్ ఫోటోగ్రఫీతో ఈ ఫోటోలు ఇంత అందంగా వచ్చాయని రోజా తెలిపారు. ఈ ఫోటోపై గెటప్ బాగుందని కొందరు, మీకు సూట్ కాలేదని కొందరు, కామెడీగా వుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నాపు.