శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 22 మే 2024 (17:01 IST)

కారు పైకి ఎక్కి నుజ్జు నుజ్జు చేసిన ఏనుగు - video

elephant
వన్యమృగాలు. రోడ్లపైకి ఇటీవలి కాలంలో ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అడవులు అంతరించిపోవడంతో వాటికి మరో దారి లేక జనావాసాల్లోకి వస్తున్నాయి. అప్పుడప్పుడు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తూ వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్నిసార్లు వీటి దాడిలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
 
అటవీమార్గం ద్వారా వెళుతున్న ఓ కారుపై ఏనుగు దాడి చేసింది. తొండంతో కారును నొక్కేసింది. కాళ్లతో తొక్కేసింది. ఏకంగా కారుపైకి ఎక్కి కూర్చోబోయింది. అదనుకోసం చూసిన కారు డ్రైవర్, ఏనుగు కాస్త ఏమరుపాటుగా వున్నప్పుడు రయ్యమంటూ తప్పించుకున్నాడు. చూడండి ఈ వీడియోను...