శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (17:44 IST)

ఎవర్రా మీరంతా..అంటూ వినూత్నంగా నీహారిక కొత్త సినిమా ప్రచారం

Neeharika Konidela new movie poster
Neeharika Konidela new movie poster
నీహారిక కొణిదెల నిర్మాతగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 సినిమా గురించి చిన్న ప్రోమోను నేడు విడుదల చేసింది. ఈనెల తొమ్మిదవ తేదీన తమ సినిమాను సాయిధరమ్ తేజ్ నామయకరణం చేస్తారని ప్రచారంలో పేర్కొంది. అంతా కొత్తవారితో యువతరంతో రూపొందిస్తున్న ఈ సినిమా ప్రోమో ఆసక్తికరంగా వుంది. తన కార్యాలయానికి నీహారిక కారుదిగి రాగానే చిత్రవిచిత్రమైన మేనరిజాలతో ఆమెను ఆహ్వానిస్తూ రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు.
 
ఊళ్ళలో పిల్లలు ఆడుకునే తొక్కుడు బిల్ల, చెమ్మచెక్క, గెంతులాట, స్టాచ్యూ.. వంటి ఆటలు ఆడుకుంటూ నీహారికను ఇరిటేట్ చేస్తుంటారు. ఎట్టకేలకు పై ఫ్లోర్ కు వచ్చి దర్శకుడితో ఎవర్ సార్.. పిచ్చాసుపత్రినుంచి వచ్చిన వారంతా కింద వున్నారంటూ.. అనడంతో.. వారిని పిలిపిస్తాడు. వారు మన సినిమా టీమ్ అంటాడు.. ఏమిటి? ఆరువేల మందిని ఆడిషన్ చేస్తే ఇలాంటివాళ్ళా.. ఎంపిక చేసిందంటూ కొశ్చన్ మార్క్ వేస్తుంది.
 
ఇలా పూర్తి గందరగోళం, పూర్తిగా వినోదంతో నిండిపోయింది. సినిమా పేరేమిటి? అని అడిగితే.. వెంటనే ఈనెల తొమ్మిదవ తేదీన వెయిట్ అండ్ సీ..అంటూ ట్విస్ట్ ఇచ్చే ప్రోమోను బట్టి.. ఇప్పటి కొత్త తరం పాత ఆటలు, అలవాట్లతో వినూత్నమైన సినిమా కథగా మార్చనున్నట్లు తెలుస్తోంది. 
 
నిహారిక కె, పింక్ ఎలిఫెంట్, SRDS స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు యధువంశీ, అనుదీప్‌దేవ్, ఎదురోలురాజు సాంకేతిక వర్గం.