ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2023 (19:44 IST)

వరుణ్ తేజ్ క్లాప్ తో నిహారిక కొణిదెల చిత్రం ప్రారంభం

Clap by Varun tej
Clap by Varun tej
నిహారిక కొణిదెల సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి నటీనటులుగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. 
 
Nagabau and niharika team
Nagabau and niharika team
ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదు వంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా...
 
నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేస్తూ వచ్చాం. తొలి సారి ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. మాతో పాటు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. తెలియని టెన్షన్‌గానూ ఉంది. యాదు వంశీగారు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంచి టీమ్‌, కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. అయితే మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం’’ అన్నారు. 
 
చిత్ర దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ ‘‘ఇప్పటి వరకు పింక్ ఎలిఫెంట్ కాన్సెప్ట్ బేస్డ్ కంటెంటట్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు. కొత్తవాళ్లతో ఈ బ్యానర్ సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామని నమ్ముతున్నాం. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ మాట్లాడుతూ ‘‘సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఈ చిత్రంతో మారుతున్నాను. పాటలు ఆల్ రెడీ కంపోజ్ చేస్తున్నాను. నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిహారికగారికి థాంక్స్. మా డైరెక్టర్ యదు వంశీగారు ఎక్స్‌ట్రార్డినరీ స్క్రిప్ట్‌ను అందించారు. నేను ఇప్పటి వరకు అలాంటి నెరేషన్ వినలేదు. మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉంది. డైరెక్టర్ వంశీకి, ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్’’ అన్నారు. 
 
సిినిమాటోగ్రాఫర్ రాజు ఎడురోలు మాట్లాడుతూ ‘‘నాకు నిహారికగారితో కలిసి పనిచేయటం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఆమె ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్‌లకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశాను. చాలా మంచి స్క్రిప్ట్. నాకు అవకాశం ఇచ్చిన వంశీగారికి థాంక్స్. నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్’’ అన్నారు. 
 
ఎడిటర్ అన్వర్ అలీ మాట్లాడుతూ ‘‘ఫింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారికగారికి, డైరెక్టర్ గారికి, ఎంటైర్ టీమ్‌కి థాంక్స్. ఆల్ ది బెస్ట్’’ అన్నారు. 
 
శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ ఫణి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో నేను, నా శ్రీమతి జయ నిర్మాతలుగా పరిచయం అవుతున్నాం. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ ఈజ్ కింగ్. అందువల్లే డిఫరెంట్ కంటెంట్‌తో ముందుకు రాబోతున్నాం’’ అన్నారు. 
 
శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ జయలక్ష్మి మాట్లాడుతూ ‘‘పింక్ ఎలిఫెంట్ బ్యానర్ సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్‌కి థాంక్స్. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ వంశీగారు మంచి స్క్రిప్ట్‌ను నెరేట్ చేశారు. తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు. 
 
 
నటీనటులు - సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు
 
సాంకతిక వర్గం - సమర్పణ - నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు - పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం - యదు వంశీ, సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ - ప్రణయ్ నైని, ఎడిటర్ - అన్వర్ అలీ, డైలాగ్స్ - వెంకట సుభాస్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).