గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (22:05 IST)

ఒకే ఒక ఫోన్ కాల్.. పెళ్లిని ఆపేసిన ఏపీజే అబ్ధుల్ కలాం.. నిజమేనా?

Abdul kalam
డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం రాష్ట్రపతిగా వున్న కాలం. ఆ సమయంలో ఓ యువతి వివాహాన్ని కలాం ఆపారు అంటే నమ్ముతారా..? నమ్మితీరాల్సిందే. అబ్ధుల్ కలాం ఓ యువతి వివాహాన్ని అడ్డుకున్నారు. కథలోకి వెళ్తే... తిరుచ్చిలోని సీనియర్ ఐపీఎస్ అధికారి కళియ పెరుమాళ్‌కి అబ్దుల్ కలాం నుంచి ఫోన్ వచ్చింది. "చెప్పండి సార్" అన్నాడు కళియమూర్తి మర్యాదగా. మరుసటి రోజు జరగబోయే అమ్మాయి పెళ్లిని ఎలాగైనా ఆపాలని కలాం అన్నారు. ఎందుకంటే అమ్మాయి వయసు 16. ప్లస్ టూ చదువుతోంది. వరుడికి 47 సంవత్సరాలు. అది రెండో పెళ్లి. సొంత మామగారు. బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. మరుసటి రోజు జరగబోయే అమ్మాయి పెళ్లిని ఎలాగైనా ఆపేయాలి అంటూ చెప్పారు.
 
అప్పుడు ఆ అమ్మాయి ఉన్నత చదువులు చదవాలనుకుంటోంది. కలాం దానికి కావాల్సిన సన్నాహాలు పూర్తి చేసేలోపే, “అది మేం చూసుకుంటాం సార్” అన్నారు కళియ పెరుమాళ్. "అమ్మాయి ఏ ఊరు సార్?" కలాం ఊరు పేరు చెప్పారు. అది తమిళనాడులోని తురయూర్ పక్కనే ఉన్న గ్రామం. మరుసటి నిమిషంలో కళియ పెరుమాళ్ తన కారులో తురయూర్ బయల్దేరారు. అప్పటికే ముసిరి పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సంఘటనా స్థలానికి రావాల్సిందిగా కోరారు.
 
కలాం చెప్పినట్లే ఆ పెళ్లిని కళియ పెరుమాళ్ ఆపేశారు. ఆ సమయంలో ఏడుస్తూ ముఖం వాచిపోయిన ప్లస్ టూ విద్యార్థిని (వధువు) సరస్వతి ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. "సరైన సమయానికి వచ్చి పెళ్లిని ఆపినందుకు ధన్యవాదాలు సార్." అంటూ చేతులెత్తి నమస్కరించింది. 
 
"సరే, మీరు తదుపరి ఏమి చదవాలనుకుంటున్నారో నాకు చెప్పండి. అన్నీ ఏర్పాటు చేస్తాం." అన్నారు కళియ పెరుమాళ్  "సరే, మనం బయలుదేరాం. అంతకుముందు ఒక సందేహం." "ఏంటి సార్?" "మా ప్రెసిడెంట్ మీ కోసం ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నారు? ఈ సమాచారం అతనికి ఎవరైనా చెప్పారా?" అని ప్రశ్నించారు కళియ పెరుమాళ్. ఈ ప్రశ్నకు ఆ వధువు ఆ సమాచారం తానే ఇచ్చానని చెప్పింది. ఆమె చెప్పిన సమాధానంతో కళియ పెరుమాళ్ విస్తుపోయారు.  
 
"కొన్నాళ్ల క్రితం అన్నామలై యూనివర్సిటీలో సెమినార్ జరిగింది. దానికి అబ్దుల్ కలాం వచ్చారు. అప్పుడు ఆయన రాష్ట్రపతి కాదు. ఆ సెమినార్‌కు సరస్వతి కూడా వెళ్ళింది. ఈ సెమినార్‌లో మాట్లాడిన తర్వాత కలాం ఇలా అన్నారు: "మీలో ఎవరైనా ఏవైనా ప్రశ్నలు అడగాలనుకుంటే, మీరు అడగవచ్చు, అయితే  నలుగురు విద్యార్థులు మాత్రమే. ప్రశ్నించాలి" అన్నారు.
 
ప్రశ్న అడిగిన నలుగురు విద్యార్థులలో ఈ సరస్వతి అంటే ఈ వధువు కూడా ఒకరు. సభ ముగియగానే.. ప్రశ్నలు వేసిన నలుగురిని పిలిచి కలాం ప్రశంసించారు. "ఇది నా విజిటింగ్ కార్డ్. అవసరమైతే నేను మిమ్మల్ని సంప్రదించగలను." కార్డులో అబ్దుల్ కలాం మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ఉన్నాయి.
 
ఎలాగోలా ఈ అమ్మాయి దాన్ని భద్రంగా ఉంచుకుంది. అదే ఈ విపత్కర సమయంలో ఆమెకు సహాయం చేసింది. ఇది విన్నకళియ పెరుమాళ్ ఆశ్చర్యపోయారు. బాలిక తదుపరి చదువులకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందించారు. ఆపై సరస్వతి సంగతి మరిచిపోయారు. 
 
కాలం గడిచిపోయింది. కళియ పెరుమాళ్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత ఓ యువతి వేదికపైకి వచ్చి మైక్ పట్టుకుంది.
 
ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడో చూసినట్టు ఉంది. అంటూ వేదికపై వున్న కళియ పెరుమాళ్ అనుకుంటూ వుండగానే ఆ మహిళ మాట్లాడటం ప్రారంభించింది. ఈ వేదికపై మాట్లాడే అదృష్టం తనకు దక్కడం అదృష్టం అంటూ పేర్కొంది. ఈ అమ్మాయి ఎవరికి కృతజ్ఞతలు చెప్పబోతోంది? అంటూ కళియ పెరుమాళ్ ఐపీఎస్ ఏమీ అర్థంకాక కూర్చున్నారు. 
 
ఆ సమయంలో "కళియ పెరుమాళ్ సార్, నేను ఇక్కడ అమెరికాలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. జీతం మూడున్నర లక్షల రూపాయలు. నా భర్తతో సంతోషంగా ఉన్నాను. నేనెవరో నీకు తెలుసా?" "నాకు తెలియదు" అన్నారు.. కళియ పెరుమాళ్. ఆ మహిళ కన్నీళ్ళతో మృదు స్వరంతో చెప్పింది: "ఒకసారి మీరు నన్ను బాల్య వివాహం నుంచి రక్షించారు. నన్ను చదువుకునేలా చేశారు. నేను తురయూర్ సరస్వతిని." అంటూ చెప్పుకొచ్చింది. 
marriage
 
ఇది ఊహించని కళియ పెరుమాళ్ ఆనందంతో పొంగిపోయాడు. "మీకు కూడా కృతజ్ఞతలు. నా జీవితంలో వెలుగును నింపినందుకు అబ్దుల్ కలాం సర్‌కి ధన్యవాదాలు." అంటూ ఆమె వేదిక నుంచి దిగిపోయింది. ఆమె మాటలను అలా వింటూ కూర్చున్న కళియ పెరుమాళ్‌కి కంట ఆనంద భాష్పాలు రాలాయి. ఈమె ఆ తర్వాత కలాంను స్వయంగా కలిసి మాట్లాడింది. ఇలా ఓ ఫోన్ కాల్‌తో కలాం ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. తాను స్వయంగా కాకపోయినా.. కళియ పెరుమాళ్ లాంటి వ్యక్తితో ఇలా చేయించారు. తద్వారా ఓ మహిళ జీవితంలో వెలుగును నింపారు.