శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 4 మార్చి 2019 (18:35 IST)

నా భార్య సరిగ్గా వుంటే..? ఫేస్‌బుక్, టిక్ టాక్ వల్లే ఇదంతా?: బాలాజీ

దాడీ బాలాజీ అంటే తమిళ తంబీలకు బాగా తెలుసు. తమిళ బిగ్ బాస్‌లో పాల్గొన్న హాస్యనటుడు దాడీ బాలాజీ ప్రస్తుతం కుటుంబ సమస్యల వల్ల వార్తల్లో నిలిచాడు. మీటూ కోసం గొంతెత్తి పలికే మహిళా సంస్థలు.. మహిళలచే ఇబ్బందులకు గురయ్యే పురుషుల గురించి ఏం పట్టించుకోవట్లేదని బాలాజీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
ఇలాంటి మహిళా సంస్థలను విడిచిపెట్టేది లేదంటూ ఫైర్ అయ్యాడు. తన భార్యతో ఇబ్బందులు ఏర్పడేందుకు చెన్నై చిందాదరిపేట పోలీస్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ కారణమని ఆరోపించాడు. ఫిర్యాదు కోసం వెళ్లిన తన భార్య నిత్యాతో అతడు సన్నిహితంగా వున్నాడని.. అలా తనకు తన భార్యతో అగాధం పెంచాడని ఫైర్ అయ్యాడు.
 
యువతులు, గృహిణులను పెడదోవ పట్టించేవి ఫేస్‌బుక్, వాట్సాప్, టిక్ టాక్‌లేనని బాలాజీ మండిపడ్డాడు. బాలాజీ భార్య అంటేనే నిత్యను అందరికీ తెలుస్తుందని.. లేకుంటే ఆమెకు గుర్తింపు వుండదని ఆయన ఫైర్ అయ్యాడు. ఇంకా ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ గురించి గొప్పగా చెప్పేందుకు ఆయన రాముడో, బుద్ధుడో కాదని మీడియా ముందు  బాలాజీ ఫైర్ అయ్యాడు. 
 
తాము గౌరవించే పోలీసు శాఖకు ఇలాంటి వ్యక్తులతో చెడ్డపేరు వస్తుందని, అంతేగాకుండా తన భార్య నిత్యపై కూడా తప్పుందని బాలాజీ అన్నాడు. మనం సక్రమంగా వుంటే ఇతరులు మనల్ని వేలెత్తి చూపెట్టడం జరగదని తెలిపాడు. నిత్య, మనోజ్ కలిసి తప్పులు చేస్తుంటే తగిన చర్యలు తీసుకుంటానని బాలాజీ హెచ్చరించాడు.