1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By TJ
Last Modified: సోమవారం, 26 మార్చి 2018 (14:27 IST)

ఆ ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తోన్న బుట్టా రేణుక...

కర్నూలు ఎమ్మెల్యే బుట్టా రేణుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కాలంగా హాట్ టాపిక్‌గా నిలుస్తూ వస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె కర్నూలు ఎంపిగా గెలిచినా ఆ తరువాత తన భర్తను టిడిపిలోకి పంపడం... ఆ తరువాత ఆమె కూడా వెళ్లిపోయిన విషయం తెలిసిం

కర్నూలు ఎమ్మెల్యే బుట్టా రేణుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కాలంగా హాట్ టాపిక్‌గా నిలుస్తూ వస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె కర్నూలు ఎంపిగా గెలిచినా ఆ తరువాత తన భర్తను టిడిపిలోకి పంపడం... ఆ తరువాత ఆమె కూడా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. జగన్ ఎంత బుజ్జగించినా ఆమె మాత్రం వెనక్కి తగ్గనేలేదు. 2014 ఎన్నికల్లో బుట్టా రేణుక తన సొంత డబ్బును బాగా ఖర్చు పెట్టారని వైసిపిలోని నేతలే బహిరంగంగా చెప్పారు. ఆ డబ్బును తిరిగి రాబట్టాలంటే అధికార పార్టీలో ఉండాలని నిర్ణయించుకున్నారు.
 
2019ఎన్నికల్లో బుట్టా రేణుక లోక్ సభ కంటే అసెంబ్లీ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. లోక్ సభకు వెళితే మంత్రి కావడం చాలా కష్టంతో కూడుకున్న పని. అదే ఎమ్మెల్యేగా గెలిచి తమ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కోసం ట్రై చేయొచ్చు. ఒక్క బుట్టా రేణుకే కాదు.. గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులు కూడా ఈసారి శాసనసభకు వెళ్ళాలని ఉవ్విళ్లూరుతున్నారు. 
 
బుట్టా రేణుక స్వస్థలం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు. ఈ నియోజకవర్గంలో టిడిపికి మంచి బలం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి నాగేశ్వర్ రెడ్డి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుధీర్ఘ కాలంగా ఈయన కుటుంబానికి టిడిపితో అనుబంధం ఉంది. ప్రస్తుతం రేణుక ఆ ఎమ్మిగనూరు నియోజకవర్గంపై కన్నేసిందన్న ప్రచారం జరుగుతోంది. రేణుక చేనేత సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఎమ్మిగనూరులో చేనేత ఓట్లు గణనీయసంఖ్యలో ఉన్నాయి. 
 
అందుకే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలిచిపోవచ్చని భావిస్తున్నారు బుట్టా రేణుక. అంతేకాదు ఈ నియోజకవర్గంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి తరచూ పర్యటిస్తున్నారు. అయితే నాగేశ్వర్ రెడ్డి మాత్రం తాను ఎట్టిపరిస్థితుల్లోను ఈ నియోజకవర్గాన్ని వదులుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. కానీ ఎంపి వచ్చి అసెంబ్లీ సీటు అడిగితే చంద్రబాబు ఖచ్చితంగా ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదట.