శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: బుధవారం, 27 అక్టోబరు 2021 (23:49 IST)

పొత్తుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం, వారితోనే కలిసి పోటీకి..?

తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు ప్రస్తుతం హోంమంత్రితో మాట్లాడి ఎపిలో జరుగుతున్నపరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. ఢిల్లీకి వెళ్ళిన ఆయనకు అపాయింట్మెంట్ దొరక్కపోయినా సరే ఫోన్ ద్వారా అమిత్ షా మాట్లాడడంతో అన్ని విషయాలను వివరించారు. 
 
ఇదంతా ఒకే అయితే ఢిల్లీకి వెళ్ళి బాబు కొన్ని కీలక విషయాలను మీడియాతో చిట్ చాట్ ద్వారా పంచుకున్నాడట. మరో రెండున్నర సంవత్సరాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా సరే ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలన్న నిర్ణయానికి వచ్చారట చంద్రబాబు.
 
అది కూడా జనసేనతోనేనన్న విషయాన్ని స్పష్టం చేశారట. ఇప్పటికే బిజెపితో దూరంగా ఉంటూ వస్తోంది జనసేన. గతంలో పవన్ కళ్యాణ్‌తో ఉన్న పరిచయాలతోనే కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారట బాబు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సద్దుమణిగిన తరువాత పొత్తులపై ముందుకు వెళ్ళాలనుకుంటున్నారట చంద్రబాబు.
 
అయితే జనసేనతో పొత్తుకు ఆ పార్టీ నేతలు ఒప్పుకుంటారా.. లేకుంటే టిడిపి నేతలు ఒప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. రెండు పార్టీల నేతలు ముఖ్య నేతలు ఒప్పుకునే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. అయినా సరే ఎలాగైనా ఒప్పించి ఖచ్చితంగా ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్ళి ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ప్లాన్లో చంద్రబాబు ఉన్నారట.