ఎంఐ నుంచి 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. ఇంకా రంగు మారే స్మార్ట్ ఫోన్ కూడా?
చైనాకు చెందిన షియోమీ అధునాతన ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రవేశపెడుతోంది. చైనా కంపెనీ షియోమీ ఎంఐ టీవీ 4సీ పేరిట 50 ఇంచుల డిస్‌ప్లేతో కూడిన సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. చైనా మార్
చైనాకు చెందిన షియోమీ అధునాతన ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రవేశపెడుతోంది. చైనా కంపెనీ షియోమీ ఎంఐ టీవీ 4సీ పేరిట 50 ఇంచుల డిస్‌ప్లేతో కూడిన సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని విడుదల చేసింది. చైనా మార్కెట్‌లో విడుదలైన ఈ టీవీ.. త్వరలోనే భారత్‌లోనూ విడుదల కానుందని ఎమ్ఐ వెల్లడించింది. ఈ టీవీ ధర రూ.22,700లని సదరు సంస్థ ప్రకటించింది.
షియోమీ ఎంఐ టీవీ 4సి ఫీచర్స్ సంగతికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగివుంటుంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై 802.11, బ్లూటూత్ 4.2, 3 హెచ్‌డీఎంఐ, 1 ఏవీ, 2 యూఎస్‌బీ, 1 ఈథర్‌నెట్ పోర్టు, హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్బీ ఆడియో డీటీఎస్‌ను ఎంఐ టీవీ 4సీ కలిగివుంటుంది. పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్- 3840 x 2160 వుంటుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు రోజురోజుకీ స్మార్ట్‌ఫోన్‌లలో కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న ఎంఐ తాజాగా త్వరలో తాము విడుదల చేయనున్న కొత్త మోడల్ ఫోన్‌కు రంగు మార్చుకోగలిగే సామర్థ్యం ఉంటుందని ప్రకటించి.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు షాక్ ఇచ్చింది. వినియోగదారులు ఏ రంగు కావాలనుకుంటే ఆ రంగులోకి ఫోన్ మారిపోతుందని ఎంఐ తెలిపింది. ఈ ఫోనుపై నెట్టింట పెద్ద చర్చే సాగుతోంది.