ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హోలీ పండుగ
Written By selvi
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (17:57 IST)

హోళీ రంగుల్లో ఆ నాలుగు వేటిని సూచిస్తాయో... తెలుసా?

హోళీ పండుగను జరుపుకునేందుకు గల కారణం చెప్పే మరో కథ వాడుకలో వుంది. పార్వతీపరమేశ్వరుల వివాహం జరిగేందుకు దేవతలందరూ మన్మథుడిని సిద్ధం చేస్తారు. అప్పడు శివుడు తపస్సులో వుంటాడు. దేవరుల ఆజ్ఞ మేరకు శివుని తపస

హోళీ పండుగను జరుపుకునేందుకు గల కారణం చెప్పే మరో కథ వాడుకలో వుంది. పార్వతీపరమేశ్వరుల వివాహం జరిగేందుకు దేవతలందరూ మన్మథుడిని సిద్ధం చేస్తారు. అప్పడు శివుడు తపస్సులో వుంటాడు. దేవరుల ఆజ్ఞ మేరకు శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూల బాణాన్ని కామదేవుడు సంధిస్తాడు. అయితే కామదేవుని శరీరాన్ని శివుడు తన త్రినేత్రంతో శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని భార్య రతి కోరికమేరకు శివుడు కామదేవుడిని మళ్ళీ బతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు. 
 
ఈ పండుగ ఫాల్గుణ మాసంలో వస్తుంది. అలాగే చిన్ని కృష్ణుడు బాల్యంలో బృందావనం, గోకులంలో  చేసిన కార్యాలను గుర్తు పెట్టుకునేందుకు ఈ పర్వదినాన్ని రంగురంగులతో జరుపుకుంటారు. దక్షిణాదిన ఉట్ల పండుగను హోళీ రోజున అట్టహాసంగా జరుపుతారు. శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. 
 
ఇంకా హోళీ పండుగ రోజున పసుపు పొడితో కలిపిన నీటిని వాడుతారు. అలాగే సువాసనలు వెదజల్లే పువ్వుల పొడిని హోలీ పండుగ రోజున ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం రసాయనాలతో కలిపిన పొడిని వాడుతున్నారు. ఎరుపు, నీలం, పసుపు రంగులను అధికంగా హోలీ పండుగ రోజున ఉపయోగిస్తారు. ఎందుకంటే.. ఎరుపు రంగు ప్రేమను సూచిస్తుంది. నీలి రంగు కృష్ణుడిని, పసుపు, పచ్చ రంగులు కొత్త ఆరంభానికి శుభ సంకేతాలిస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.