శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (17:56 IST)

దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయం.. ప్రధాని మోదీ శంకుస్థాపన

దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దుబాయ్‌ పర్యటనలో వున్న ప్రధాని మోదీ ఆదివారం (ఫిబ్రవరి 11) ఓపెరా హౌస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

దుబాయ్‌లో తొలి హిందూ దేవాలయానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దుబాయ్‌ పర్యటనలో వున్న ప్రధాని మోదీ ఆదివారం (ఫిబ్రవరి 11) ఓపెరా హౌస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 
 
హిందూ దేవాలయ నిర్మాణానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. ఆలయ నిర్మాణానికి యూఏఈ యువరాజు మొహ్మద్ బిన్ అనుమతి ఇవ్వడం ప్రశంసించదగిన విషయమని తెలిపారు. భారత్-యూఏఈ మధ్య ఎప్పటి నుంటి మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. 
 
దుబాయ్‌లో హిందూ దేవాలయం నిర్మాణానికి రూ.125 కోట్ల భారతీయుల తరపున సౌదీ యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ నుంచి వచ్చిన 30 లక్షల మందికి స్వదేశంలో ఉంటున్న వాతావరణం కల్పించడం సంతోషాన్నిస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. అంతకుముందు అబుదాబి సైనికులకు మోదీ నివాళులు అర్పించారు.