1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (16:46 IST)

90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలి: ఎంపీ గల్లా జయదేవ్

విభజన వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయామని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మిగతా దక్షిణ భారత రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఏపీని కేంద్రం ఆదుకోవాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు రాజ్యసభలో

విభజన వల్ల ఎన్నో ఆస్తులు కోల్పోయామని తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మిగతా దక్షిణ భారత రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు ఏపీని కేంద్రం ఆదుకోవాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు రాజ్యసభలో ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని గల్లా జయదేవ్ ప్రస్తావించారు. 
 
రాష్ట్ర విభజన సమయానికి రాష్ట్రం విద్యుత్ లోటుతో, లోటు బడ్జెట్‌లో ఉందని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం 90:10 నిష్పత్తిలో రాష్ట్రానికి నిధులు రావాలని, తలసరి ఆదాయం ప్రకారం చూసుకుంటే రాష్ట్రానికి చాలా రావాల్సి ఉందని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.
 
ఏపీకి న్యాయం చేయాలని పార్లమెంట్‌లోనూ అన్ని పక్షాలు డిమాండ్ చేశాయని గుర్తు చేశారు. ఏపీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని అందరికీ అర్థమైందని గల్లా జయదేవ్ తెలిపారు. ఏపీలో జాతీయ రహదారుల కోసం లక్ష కోట్ల రూపాయలు చేశామని కేంద్ర ప్రభుత్వం అంటోందని.. కానీ ఖర్చు చేసింది కేవలం రూ.5,900 కోట్లు మాత్రమేనని గల్లా గుర్తు చేశారు.