మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2018 (09:27 IST)

చంద్రగ్రహణం రోజున మెరుపు వేగంతో వెళ్లిన వస్తువు (వీడియో)

చంద్రగ్రహణం రోజున బ్లూబ్లండ్ మూన్ కనిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు జనాలు ఎగబడ్డారు. జనవరి 31న ప్రపంచం మొత్తం చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తి చూశారు. అయితే ఈ

చంద్రగ్రహణం రోజున బ్లూబ్లండ్ మూన్ కనిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు జనాలు ఎగబడ్డారు. జనవరి 31న ప్రపంచం మొత్తం చంద్రగ్రహణాన్ని ఎంతో ఆసక్తి చూశారు. అయితే ఈ గ్రహణ సమయంలో చంద్రుని పక్కనుంచి మెరుపు వేగంతో వెళ్లిన ఓ వస్తువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
నాసా విడుదల చేసిన వీడియోలో ఈ వస్తువు కనిపించింది. ఆ వస్తువు కనిపించడం ద్వారా ఏలియన్స్ ఉన్నారనేందుకు నిదర్శనమని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. మనిషి తయారు చేసిన వాహకం కూడా అతి వేగంగా వెళ్లడం సాధ్యం కాదని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓ ఛానల్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.