ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (16:13 IST)

చంద్ర గ్రహణంలో ఇలా దానం చేయాలి.. చంద్ర గాయత్రి మంత్రాన్ని..?

చంద్ర గ్రహణ దోష నివారణకు ఏ రాశుల వారు.. ఏ దానాలు చేయాలో తెలుసుకుందాం.. చంద్రగ్రహణ మిశ్రమ ఫలం గలవారు అనగా మిథున, వృశ్చిక, మకర, మీన రాశుల వారు, గ్రహణ అశుభ ఫలం కలిగిన వారు మేష, కర్కాటక, సింహ, ధనస్సు రాశు

చంద్ర గ్రహణ దోష నివారణకు ఏ రాశుల వారు.. ఏ దానాలు చేయాలో తెలుసుకుందాం.. చంద్రగ్రహణ మిశ్రమ ఫలం గలవారు అనగా మిథున, వృశ్చిక, మకర, మీన రాశుల వారు, గ్రహణ అశుభ ఫలం కలిగిన వారు మేష, కర్కాటక, సింహ, ధనస్సు రాశుల వారు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం కలిగిన వారు ఓ కొత్త కాంస్య పాత్రలో నిండుగా ఆవు నేతిని పోసి అందులో వెండితో తయారైన చంద్రుని ప్రతిమ, నాగ విగ్రహము వేసి పూజించి గ్రహణ మోక్ష కాలం తర్వాత గ్రహమ స్నానమాచరించి సద్భ్రాహ్మణునికి దక్షిణా సమేతంగా సంకల్పయుక్తంగా దానం ఇవ్వాలి. 
 
అపాత్ర దానం శూన్యం ఫలాన్నిస్తుంది. సదాచార సంపన్నులు, నిష్ఠా గరిష్ఠులు, నిత్య జపతప హోమ యాగ క్రతువులు, నిత్య దేవతార్చన చేయువారు, వేదాధ్యయనము చేసిన పండితులకు దానము ఇవ్వాలి. అప్పుడే దాన ఫలితం లభిస్తుంది. 
 
గ్రహణ సమయంలో ''ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృత తత్వాయ ధీమహి 
తన్నో చంద్ర ప్రచోదయాత్'' అనే చంద్ర గాయత్రి మంత్రంతో జపము చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో నదీ స్నానం చేసి.. నదీ తీరంలో అనుష్టానం చేసుకోవడం ద్వారా పుణ్యప్రదమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.