శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (13:13 IST)

ఆ ఫిలిమ్ నాది కాదు.. మార్ఫింగ్ చేసి పెట్టారు: మోడల్ శ్యామల

యాంకర్ శ్యామలకు సంబంధించి ఓ బ్లూ ఫిల్మ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలపై శ్యామల స్పందించింది. అది తన చిత్రం కాదని ఓ బ్లూ ఫిల్మ్‌లో నటించిన ఓ మోడల్ ఫేస్‌కు తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి, ఆ వీడియో

యాంకర్ శ్యామలకు సంబంధించి ఓ బ్లూ ఫిల్మ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలపై శ్యామల స్పందించింది. అది తన చిత్రం కాదని ఓ బ్లూ ఫిల్మ్‌లో నటించిన ఓ మోడల్ ఫేస్‌కు తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి, ఆ వీడియోను ఇంటర్నెట్‌లో పెట్టారని చెప్పింది. 
 
అయితే ఆ వీడియోను అప్‌లోడ్ చేసిన వెబ్‌సైట్ వారితో మాట్లాడి, వీడియోను తొలగించామని వెల్లడించింది. దూరంగా వున్న వ్యక్తులను దగ్గర చేసేందుకు సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుందని.. ఇదే సమయంలో, చెడు విషయాన్ని వైరల్ చేయడంలోనూ సోషల్ మీడియా పాపులరేనని శ్యామల వ్యాఖ్యానించింది. 
 
సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియోను తన భర్త తనకు షేర్ చేసేంత వరకు తెలియదని తెలిపింది. తన భర్త కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో వున్న వ్యక్తే కావడంతో.. ఆ వీడియోను లైట్ తీసుకున్నాడని.. ఇలాంటివి సహజమేనని పట్టించుకోలేదని వెల్లడించింది. తన భర్త తనను అర్థం చేసుకోకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తలచుకుంటేనే భయం వేస్తుందని శ్యామల తెలిపింది.