మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 14 మే 2018 (17:54 IST)

కర్ణాటక అసెంబ్లీ పోల్స్ : తెరపైకి దళిత సీఎం.. రేసులో ఖర్గే..

దేశం యావత్తూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ ఫలితాల సంగతి ఏమోగానీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం దళిత ముఖ్యమంత్రి అంశం తరపైకి వచ్చింది.

దేశం యావత్తూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ ఫలితాల సంగతి ఏమోగానీ, కాంగ్రెస్ పార్టీలో మాత్రం దళిత ముఖ్యమంత్రి అంశం తరపైకి వచ్చింది. దళితునికి సీఎం పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే తన పదవిని త్యజించేందుకు సిద్ధమేనని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యల నేపథ్యంలో ఖర్గే స్పందించారు.
 
దీనిపై ఆ పార్టీ సీనియర్ నేత, లోక్‌సభ విపక్ష నేత మల్లికార్జున ఖర్జే స్పందించారు. దళిత ముఖ్యమంత్రి అంశాన్ని మీడియానే లేవనెత్తుతోందంటూ మండిపడ్డారు. ప్రతిసారీ ఇదే అంశం వారికి పరిపాటైందని మండిపడ్డారు. 
 
"ఐక్యంగా ఉన్న తమలో విభేదాలు సృష్టించేందుకే దళిత సీఎం అంశాన్ని మీడియా లేవనెత్తుతోంది. మైనారిటీ సీఎం అనో మరో సీఎం అనో ఎందుకు అనరు? ఏదిఏమైనా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. మరో 10 -12 గంటల్లో అది కూడా తేలిపోతుంది" అని ఖర్గే అన్నారు. 
 
కాగా, ఈనెల 12న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 72.36 శాతం పోలింగ్ నమోదైంది. 224 స్థానాలకు గాను 222 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల నేతలు ఎవరికివారే గెలుపుధీమాను వ్యక్తం చేస్తున్నాయి. 
 
అదేసమయంలో కాంగ్రెస్ అధిష్టానం దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తే ఆ పదవిలో సీనియర్ నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే మొదటి స్థానంలో ఉన్నారని చెప్పొచ్చు. పైగా, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు కూడా.