నడిరోడ్డుపై కునుకు తీసిన మొసలి.. (video) వైరల్
మెక్సికోలో నడిరోడ్డుపై ఓ మొసలి కునుకు తీసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలో జునాచోలో ఎప్పుడూ రద్దీగా వుండే రోడ్డుపై ఓ మొసలి దర్శనమిచ్చింది.
రోడ్డుకు సమీపంలోని చెరువు నుంచి బయటికి వచ్చిన 10 అడుగులున్న మొసలి రోడ్డుకు అడ్డంగా పడుకుని కాసేపు కునుకుతీసింది. ఆపై మెల్లమెల్లగా రోడ్డును దాటుకుంది.
ఈ సందర్భంగా చాలామంది ఆ మొసలి నడకను వీడియో తీశారు. ఫోటోలను కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకేముంది.. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.