మాజీ ప్రియురాలిపై ఖాకీ కొడుకు అరాచకం.. గొడ్డును బాదినట్టు...

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఢిల్లీ నార్కోటిక్స్ విభాగంలో పనిచేసే ఓ ఏఎస్ఐ కుమారుడు ఓ కాల్‌సెంటర్ ఉద్యోగిని గొడ్డును బాదినట్టు బాదాడు. తన తండ్రికి ఉన్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోయాడ

delhi cop son
pnr| Last Updated: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (16:10 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఢిల్లీ నార్కోటిక్స్ విభాగంలో పనిచేసే ఓ ఏఎస్ఐ కుమారుడు ఓ కాల్‌సెంటర్ ఉద్యోగిని గొడ్డును బాదినట్టు బాదాడు. తన తండ్రికి ఉన్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోయాడు. మద్యంమత్తులో ఉన్న ఆ కిరాతకుడు బాధిత అమ్మాయి వేడుకుంటున్నా కనికరించలేదు. చేతులతో, కాళ్లతో ఇష్టమొచ్చినట్లు తన్నాడు. పిడిగుద్దులు కురిపించాడు. బూతులు తిడుతూ ఆ యువతిని దారుణంగా హింసించాడు. ఓ కాల్ సెంటర్ కార్యాలయంలో జరిగిన ఈ దాడి దృశ్యాలను ఒకరు సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, ఇది వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఢిల్లీకి చెందిన 22 యేళ్ల జ్యోతిశర్మ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తోంది. ఢిల్లీ నార్కోటిక్స్ ఏఎస్ఐ అశోక్ సింగ్ తోమర్ కొడుకు రోహిత్ తోమర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య ఏడాదిన్నకాలంగా డేటింగ్‌ చేస్తూ వచ్చింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే జ్యోతి తండ్రికి.. రోహిత్ ప్రవర్తనపై అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి ద్వారా వివరాలు సేకరించాడు. రోహిత్ తాగుబోతు, తిరుగుబోతు, డ్రగ్స్ బానిస, ఉన్మాది అని తేలింది. పైగా ఉద్యోగం కూడా లేదు. జ్యోతికి అబద్ధాలు చెప్పి కవర్ చేసినట్లు తేలింది. దీంతో జ్యోతి పెళ్లికి నిరాకరించింది. 
 
జీర్ణించుకోలేని రోహిత్ ఆమెను చంపుతానని బెదిరింపులకు దిగాడు. గొడ్డలితో నరికేస్తానని, యాసిడ్ దాడి చేస్తానని, తను పోలీసు కొడుకును కనుక ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగాడు. దీంతో జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది అయినా రోహిత్ వెనక్కి తగ్గలేదు. 'నువ్వు నన్ను కాదంటే.. ఈ వీడియోలోని అమ్మాయిని తన్నినట్లు తంతా..' అంటూ 15 రోజుల కిందట ఓ వీడియో పంపాడు. ఆ వీడియో జ్యోతి ప్రస్తావన కూడా వచ్చింది.
 
దీంతో జ్యోతి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు తప్పనిసరి అన్నట్లు అతణ్ని ముందస్తు కస్టడీలోకి తీసుకున్నారు. అయినా రోహిత్ బెదిరింపులు ఆగలేదు. తనను ఎవరూ ఏమీ చేయలేరని జ్యోతిని ఫోన్లో బెదిరించాడు. ఆమె మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఖాకీలు మాత్రం తూతూ మంత్రంగా అరెస్టు చేసి రోహిత్‌ను అదుపులోకి తీసుకుని వదిలివేశారు. ఆ తర్వాత కూడా కూడా బెదిరించసాగాడు. ఈ క్రమంలో రోహిత్ యువతిని చితకబాదిన వీడియోను అతని స్నేహితుడే తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా అది వైరల్ అయింది.దీనిపై మరింత చదవండి :