శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:57 IST)

హిజ్రాగా మారిన భారత మాజీ క్రికెటర్.. ఎవరు?

భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ హిజ్రాగా మారిపోయాడు. అచ్చం హిజ్రాల్లాగానే చీరకొట్టి.. బొట్టుపెట్టి... తానుకూడా హిజ్రాలకు ఏం తీసిపోనని నిరూపించాడు. అసలు గౌతం గంభీర్ ఏంటి.. హిజ్రా మారిపోవడం ఏంటనే కదా మీ

భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ హిజ్రాగా మారిపోయాడు. అచ్చం హిజ్రాల్లాగానే చీరకొట్టి.. బొట్టుపెట్టి... తానుకూడా హిజ్రాలకు ఏం తీసిపోనని నిరూపించాడు. అసలు గౌతం గంభీర్ ఏంటి.. హిజ్రా మారిపోవడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.
 
సామాజిక సేవలోనే కాదు... ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో గౌతం గంభీర్ ఎపుడూ ముందువరుసలో ఉంటాడు. అంతేకాక.. సమాజంలో జరుగుతున్న కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ఇతర ఘటనల గురించి సోషల్‌మీడియా వేదికగా అతను గళమెత్తుతూ ఉంటాడు. 
 
అయితే సమాజంలో హిజ్రాలపై ఉన్న చిన్న చూపుని చెరిపేసేందుకు గంభీర్ తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు నాందిగా ఈ యేడాది రక్ష బంధన్ రోజున అతను హిజ్రాలతో రాఖీలు కట్టించుకొని ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. 
 
తాజాగా గంభీర్ మ‌ద్దతు ప‌లుకుతూ హిజ్రా వేషాన్ని ధ‌రించాడు. ఢిల్లీలో హిజ్రాల‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో అత‌ను బొట్టు పెట్టుకుని హిజ్రాలు వేసుకునే దుస్తులు ధ‌రించాడు.
 
ఇందుకు సంబంధించిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. తన స్థాయిని పక్కన పెట్టి హిజ్రాల కోసం ఇలాంటి పని చేసిన గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ.. సోషల్‌మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు.