బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 3 మే 2018 (12:32 IST)

ఏపీలో 40 వేల పిడుగులు... 39 మంది మృతి: రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్... 27 మంది మృతి

పిడుగులంటే సహజంగా తొలకరి సమయంలో పడుతుంటాయి. కానీ వేసవి ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి ఈ పిడుగులు. నిన్న మంగళవారం నాడు ఏకంగా 13 జిల్లాల్లో 40 వేలకు పైగా పిడుగులు పడ్డాయంటే వాతావరణ

పిడుగులంటే సహజంగా తొలకరి సమయంలో పడుతుంటాయి. కానీ వేసవి ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి ఈ పిడుగులు. నిన్న మంగళవారం నాడు ఏకంగా 13 జిల్లాల్లో 40 వేలకు పైగా పిడుగులు పడ్డాయంటే వాతావరణ పరిస్థితి ఎంత గందరగోళంగా వున్నదో అర్థమవుతుంది. ఈ భయానక పిడుగులు కారణంగా రాష్ట్రంలో 39 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 14 మంది చనిపోయారు. 
 
గతంలో ఎప్పుడూ చోటుచేసుకోని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుల దాడి ఎక్కువైంది. మేఘాలు పట్టాయంటే జనం గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. సహజంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ మొదటి వారంలో వేసవి తీవ్రత ఎక్కువగా వుంటుంది. ఇలాంటి సమయంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా వుంటాయి. సముద్రం పైనుంచి వచ్చే గాలుల్లో తేమ శాతం పెరిగితే ఆకాశం మేఘావృతమవుతుంది. వీటిని క్యుములోనింబస్ మేఘాలంటారు. ఇవి వర్షించడం మొదలుపెడితే పిడుగల వాన కురుస్తుంది. కనుక ప్రజలు అప్రమత్తంగా వుండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
మరోవైపు రాజస్థాన్ రాష్ట్రంలో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి 100 మందికి పైగా తీవ్ర గాయాలపాలవగా 27 మంది మృత్యువాత పడ్డారు.