శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (13:40 IST)

Fun moments: ఏపీ కలెక్టర్ల సదస్సులో పేలిన చలోక్తులు.. నవ్వుకున్న పవన్ కల్యాణ్ (video)

Pawan kalyan
Pawan kalyan
పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి కాకినాడ పోర్టులో 3 చెక్‌ పోస్టులు పెట్టిన తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఎవరిని నిందించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దీనికి అడ్డుకట్ట వేయడం కలెక్టర్, ఎస్పీల బాధ్యత కాదా అని నిలదీశారు. ఆ అధికారులు దీన్ని ఎలా విస్మరిస్తారన్నారు. విజిలెన్స్ శాఖ తన పని తాను సక్రమంగా నిర్వర్తిస్తే మంత్రి అక్కడి వెళ్లి అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందన్నారు. 
 
ఈ నేపథ్యంలో అమరావతిలో జరుగుతున్న ఈ కలెక్టర్ల సదస్సులో ఇలాంటి సీరియస్ చర్చలు జరిగాయి. ఇంకా కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కలెక్టర్లను ఉద్దేశించి ఏపీ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. 
RP Sisodia
RP Sisodia
 
తన శక్తుల్ని మరిచిపోయేలా హనుమంతునికి ఓ శాపం వుందని.. లంకకు వెళ్లాల్సిన సమయంలో సముద్రాన్ని దాటాల్సి వచ్చినప్పుడు జాంబవంతుడు గుర్తు చేస్తే తప్ప.. ఆ విషయాన్ని గుర్తుంచుకోలేదని రామాయణాన్ని ప్రస్తావించారు. కలెక్టర్ల అధికారాలను జాంబవంతుడిలా గుర్తు చేస్తున్నానని చలోక్తులు విసిరారు. 
 
కళ్లముందే అక్రమాలు జరుగుతున్నప్పటికీ సాక్షులుగా వుండిపోతున్నారే తప్ప చర్యలు తీసుకోవట్లేదని మొదటి రోజు డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్లకు ఇది కొనసాగింపుగా తీసుకోవచ్చు. 
Pawan kalyan
Pawan kalyan
 
ఈ ప్రస్తావన సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లతో పాటు అందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.