బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (22:31 IST)

భారత్‌కు కోహినూర్ వజ్రం.. అన్వేషణ కొనసాగుతోంది.. బాగ్చి

Kohinoor
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణానంతరం.. కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి తీసుకురావాలన్న డిమాండ్లు పెరిగిపోయాయి. చెప్పారు. భూ ఉపరితలంపై అతిపెద్ద వజ్రంగా దీన్ని పరిగణిస్తుంటారు. కోహినూర్ వజ్రం 108 క్యారట్లతో ఉంటుంది. దీన్ని 1849లో రాణి విక్టోరియాకు రాజా మహారాజా దిలీప్ బహూకరించారు. దీన్ని స్వదేశానికి తిసుకురావాలన్న డిమాండ్లు పెరిగిపోవడంతో విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు.

కోహినూర్ వజ్రాన్ని సంతృప్తికరమైన పరిష్కారం కోసం మార్గాల అన్వేషణ కొనసాగుతుందని బాగ్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే పార్లమెంటులో దీనిపై స్పందన తెలియజేసిందన్నారు. ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నామని చెప్పారు.