శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 జులై 2022 (13:30 IST)

లాల్ బహదూర్ శాస్త్రి - హోమి భాభాలను మేమే చంపేశాం : యూఎస్ సీఐఏ మాజీ అధికారి

sashtri - bhabha
భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్ర, భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహంగీర్ భాభాలను తామే చంపేశామని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏకు చెందిన మాజీ ఉన్నతాధికారి క్రౌలీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తన అణ్వాయుధ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం అమెరికా ముప్పుగా పరిగణించిందని, పైగా, భారతీయులు ప్రపంచంలో గొప్పశక్తిగా ఎదగడాన్ని తాము కోరుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
లాల్, భాభా మరణాల వెనుక మిస్టరీ ఇప్పటికీ తెలియదు. ముఖ్యంగా శాస్త్రి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో సీఐఏ ఆపరేషన్స్ బాధ్యతలు నిర్వహించిన క్రౌలీ మాట్లాడుతూ, శాస్త్రి, భాభా నేతృత్వంలో భారత్ అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లడం, తమ శత్రుదేశం రష్యాతో అంటకాగడం అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి వారి హత్యకు సీఐఏ కుట్ర పన్నిందని ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. పైగా, భారతీయులు ఎంతో తెలివైన వారని, వాళ్లు ప్రపంచంలో గొప్ప శక్తిగా ఎదగబోతున్నారనే విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోయామని పేర్కొన్నారు. 
 
కాగా, 1966 జనవరి 11వ తేదీన పాకిస్థాన్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఖాన్‌తో కలిసి ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌‌లో తాష్కెంట్ ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారు. అదే రోజు అర్థరాత్రి ఆయన గుండెపోటుతో మరణించారు. దీని వెనుక సీఐఏ హస్తముందని ఆయన సంచలన విషయాన్ని వెల్లడించారు. 
 
అలాగే, భారత అణుశాస్త్ర పితామహుడు హోమీ భాభా విమానంలో వియత్నాం వెళుతుండగా హతమార్చినట్టు క్రౌలీ వెల్లడించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో చాలా కష్టపడి పేలుడు పదార్థాలు చేరవేశామన్నారు. పైగా, ఈ విమానాన్ని వియన్నా గగనతలంలోనే పేల్చేవేద్దామని భావించినప్పటికీ విస్ఫోటనం తర్వాత విమానం ముక్కలు కావడానికి ఎత్తైన పర్వత ప్రాంతంలో కూలిపోయేలా చేశామని ఆయన తన పుస్తకంలో రాశారు.