శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (13:59 IST)

అస్సాంను వణికిస్తున్న జపనీస్ ఎన్సెఫాలిటీస్ (జేఈ) వ్యాధి

dengue
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ) అనే వ్యాధి వణికిస్తుంది. దోమల కారణంగా వ్యాపించే ఈ వ్యాధి సోకిన మనుషుల్లో తీవ్రమైన మెదడు వాపునకు దారితీస్తుంది. అలాగే, తీవ్రమైన జ్వరం, తలనొప్పితో రోగులు బాధపడుతారు. పైగా, ఈ వ్యాధిని గుర్తించి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి శరవేగంగా వ్యాప్తిస్తుండటంతో అస్సాం వాసులు భయంతో వణికిపోతున్నారు. 
 
మరోవైపు, ఈ వ్యాధి వెలుగులోకి వచ్చిన 15 రోజుల్లోనే 23 మంది అస్సామీయులు చనిపోయారని జాతీయ ఆరోగ్య మిషన్ వెల్లడించింది. శుక్రవారం మరో నలుగురు మృత్యువాతపడినట్టు తెలిపింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 కేసులు వెలుగు చూసినట్టు పేర్కొంది. 
 
ఈ రాష్ట్రంలోని బార్‌పేట్, కామరూప్ మెట్రోపాలిటన్, కర్బీ, అంగ్లాంగ్ ఈస్ట్, హోజాయ్ ప్రాంతాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలిపింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 160 కేసులు నమోదు కావడం ఈ వ్యాధి తీవ్రతకు అద్దంపడుతుంది.