ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

దేశంలో కొత్తగా 18 వేల కరోనా పాజిటివ్ కేసులు

Covid Vaccine
దేశంలో కొత్తగా 18,257 మంది కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 18257 మందికి ఈ వైరస్ సోకింది. మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కొవిడ్​ నుంచి తాజాగా 14,553 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.30 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా ఉంది. 
 
కాగా, ఈ కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,36,22,651, అలాగే, ‬మొత్తం మరణాల సంఖ్య 5,25,428గా ఉండగా, యాక్టివ్ కేసులు 1,28,690గా ఉండగా, కోలుకున్నవారి సంఖ్య 4,29,68,533గా ఉంది.