బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (21:50 IST)

తోడేలు సూట్ కోసం.. రూ.20 లక్షలు ఖర్చు చేశాడు..

Wolf
Wolf
అచ్చం తోడేలును పోలి ఉండేలా ప్రత్యేకంగా ఓ సూట్‌ను తయారు చేయించుకున్నాడు. ఆ సూట్ ధరిస్తే ఎవరైనా సరే తోడేలులానే కనిపిస్తారు. జెప్పెట్ వర్క్ షాప్ అనే మోడలింగ్ సంస్థ ఈ తోడేలు సూట్‌ను రూపొందించింది. ఆ కల నెరవేర్చుకునేందుకు అతడు రూ.20 లక్షలు ఖర్చు చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే, 32 ఏళ్ల టోరు ఉయిడా వృత్తిరీత్యా ఓ ఇంజినీర్. తోడేలులా కనిపించాలన్నది అతడి చిన్ననాటి కల. తోడేలు కాస్ట్యూమ్ కోసం.. జెప్పెట్ వర్క్ షాప్‌ను ఆశ్రయించాడు. 
 
టోరు ఉయిడా తనకు తోడేలు కాస్ట్యూమ్ కావాలని కోరాడు. అతడి నుంచి ఆర్డర్ స్వీకరించిన జెప్పెట్ సంస్థ ఏడు వారాల వ్యవధిలో ఆ సూట్ తయారు చేసింది. 
 
ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఈ తోడేలు సూట్ ధరించి రిలాక్స్ అవుతానని, బాధలన్నీ మర్చిపోతానని వెల్లడించాడు. అంత ఖర్చు పెట్టి తయారు చేయించుకున్న తోడేలు సూట్‌ను ఇంట్లోనే ధరిస్తానని తెలిపాడు.