శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 10 జూన్ 2018 (17:30 IST)

మా గూటికి వచ్చేందుకు అడుగు దూరంలో అసంతృప్తులు : యడ్యూరప్ప

కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రిత్వ శాఖల కేటాయింపుల్లో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే, మంత్రులుగా అవకాశం దక్కని కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు లోలోన రగిల

కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రిత్వ శాఖల కేటాయింపుల్లో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే, మంత్రులుగా అవకాశం దక్కని కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులు లోలోన రగిలిపోతున్నారు. ఇలాంటి వారితో బీజేపీ టచ్‌లో ఉంది.
 
ఇదే అంశంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మాట్లాడుతూ, జేడీఎస్‌, కాంగ్రెస్‌లోని అసంతృప్తులు బీజేపీలో చేరేందుకు మరో అడుగు దూరంలో ఉన్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రుల లాబీయింగ్‌కే సరిపోయిందని, రాష్ట్రాభివృద్ధి స్తంభించిందన్నారు.
 
కీలకమైన శాఖలు జేడీఎస్‌కు కేటాయించి కాంగ్రెస్‌కు కర్ణాటకలో భవిష్యత్తులేకుండా చేసుకున్నారన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపు, మంత్రి పదవులకోసం లాబీయింగ్‌లకే 25 రోజులు పట్టిందని ఇక పాలన ఎలా ఉంటుందోనని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. 
 
జేడీఎస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలో రుణమాఫీ, సీనియర్‌ సిటిజన్లకు, పేద మహిళలకు పింఛను వంటి వాగ్ధానాలతో 37సీట్లు సాధించిందని, లేనిపక్షంలో 20 సీట్లు కూడా అధిగమించి ఉండేది కాదన్నారు. ఈ సంకీర్ణ సర్కారు త్వరలోనే కూలిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.