శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (15:28 IST)

ఆపరేషన్ థియేటర్‌ రోగి... ముద్దుల్లో మునిగిన నర్సు - డాక్టరు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు ఏవిధంగా ఉంటాయో మరోమారు వైద్య సిబ్బంది కళ్లకుకట్టినట్టు చూపించారు. ఆపరేషన్ థియేటర్‌లో బెడ్‌పై రోగిని పడుకోబెట్టి... నర్సు - డాక్టరు ముద్దుల్లో మునిగిపోయారు. ఈ ముద్దులకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీలో ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి ఆపరేషన్ చేసేందుకు ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. ఆపరేషన్ చేసేందుకు వచ్చిన 49 యేళ్ళ సివిల్ సర్జన్ (వైద్యుడు), అదే ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సుతో ముద్దుల్లో మునిగిపోయారు. 
 
ఈ విషయం బయటకు పొక్కి, చివరకు జిల్లా కలెక్టర్ శశాంక్ మిశ్రా దృష్టికెళ్ళింది. దీంతో ఆయన ప్రాథమిక విచారణకు ఆదేశించగా, ముద్దుల వర్షం నిజమేనని తేలింది. దీంతో వైద్యుడుని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు.