సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 అక్టోబరు 2019 (09:29 IST)

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కాషాయ కూటమి ప్రభంజనం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీ కూటమి 158 కోట్ల, కాంగ్రెస్ కూటమి 76 చోట్ల, ఇతరులు 20 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
ఈ ట్రెండ్ సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వెనుకంజలో ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కూటమి తన హవా చాటుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలోకి దిగిన దిగ్గజ నేతలు ముందంజలో కొనసాగుతున్నారు. 
 
బీజేపీకి చెందిన పంకజా ముండే... పర్లీ సీటులో తన సత్తా చాటుతున్నారు. భోకర్ నుంచి పోటీకి దిగిన అశోక్ చవాన్(కాంగ్రెస్) లీడ్‌లో కొనసాగుతున్నారు. అదేవిధంగా వర్లీ నుంచి పోటీ చేసిన ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు. శివసేన నుంచి పోటీకి దిగిన ఏకనాథ్ షిండే మొదటి రౌండ్‌ నుంచి తన హవా కొనసాగిస్తున్నారు.