శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 13 ఆగస్టు 2018 (15:27 IST)

తెదేపా మంత్రులు ఆడాళ్లో.. మగాళ్లో అర్థం కావట్లేదు : ఆర్కే. రోజా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికార టీడీపీ మంత్రులపై వైకాపా శాసనసభ్యురాలు ఆర్కే.రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులు అట్టడుగుస్థాయికి దిగజారి తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విమర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికార టీడీపీ మంత్రులపై వైకాపా శాసనసభ్యురాలు ఆర్కే.రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులు అట్టడుగుస్థాయికి దిగజారి తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. నిజంగా వారు మగవాళ్లో, ఆడవాళ్లో తెలియడం లేదంటూ ఈ నగరి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
ఒంగోలులో ఆమె మాట్లాడుతూ, టీడీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సతీమణి భారతిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఓ కేసులో ఏడు సంవత్సరాల తర్వాత జగన్ భార్య భారతి పేరును చేర్చడమేంటని ప్రశ్నించిన ఆమె, ఓ కుట్ర ప్రకారం ఇదంతా జరుగుతోందని నిప్పులు చెరిగారు.
 
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టీడీపీ పూర్తిగా కుమ్మక్కైపోయిందన్నారు. అందువల్లే టీడీపీ నేతలు అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మీ ఇంట్లోని వాళ్లను కూడా ఇలాగే కోర్టుకులాగే పరిస్థితి వస్తుందన్నారు.