మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (22:27 IST)

ఐరాసలో నిత్యానంద రాగం.. కైలాస నుంచి మహిళా ప్రతినిధి స్పీచ్!

Nithyananda
Nithyananda
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యాచారం, అపహరణ వంటి పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై భారత్‌లో నాన్ బెయిలబుల్ వారెంట్ సైతం జారీ అయ్యింది. 2019లో దేశం నుంచి పారిపోయిన నిత్యానంద.. 2020లో ఈక్వెడార్ తీరానికి దగ్గర ఓ ద్వీపాన్ని కైలాస దేశంగా ప్రకటించారు. ఇక అక్కడ తన కరెన్సీని కూడా రిలీజ్ చేశారు. 
 
తాజాగా నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. కైలాస పేరుతో ఆయన సృష్టించుకున్న ప్రత్యేక దేశం తరపున ఇద్దరు ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరయ్యారు. తనను తాను విజయ ప్రియ నిత్యానందగా పరిచయం చేసుకున్న ఓ మహిళా ప్రతినిధి.. నిత్యానందను భారత సర్కారు వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. 
 
జెనీవాలో జరిగిన సీఈఎస్‌సీఆర్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హిందువుల కోసం తొలి సార్వభౌమ దేశంగా కైలాసను నిత్యానందను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 
Nithyananda
Nithyananda
 
హిందూ సంప్రదాయాలను, నాగరికతను ఆయన పునరుద్ధరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత కైలాస నుంచి మరో ప్రతినిధి ఈఎన్ కుమార్ కూడా నిత్యానందకు మద్దతుగా కైలాస గొప్పతాన్ని గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చకు దారితీసింది.