శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (23:23 IST)

8 తులాల గోల్డ్ చైన్ కోసం.. వృద్ధురాలి మెడకు టవల్ బిగించి..?

Old woman attacked by cable man
Old woman attacked by cable man
అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మీ నారాయణమ్మ మెడకు టవల్ బిగించి ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. ఆమె మెడలోని ఎనిమిది తులాల గోల్డ్ చైన్‌ను కాజేశాడు. ఈ తతంగం అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. 
 
కేబుల్‌లో పని చేసే గోవింద్‌ అనే వ్యక్తి వృద్ధురాలిపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతనిపై బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.