మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (16:02 IST)

''పప్పు'' ఇప్పుడు పరమ పూజ్యుడైనాడు.. రాహుల్ గాంధీపై రాజ్ థాక్రే

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీని ప్రశంసించారు. ''పప్పు'' అని పిలువబడిన రాహుల్ గాంధీ ప్రస్తుతం ''పరమ పూజ్యుడు'' అయ్యాడని రాజ్ థాక్రే పేర్కొన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని థాక్రే ఎత్తిచూపారు.


కాంగ్రెస్ సారథిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో రాహుల్ గాంధీ.. ఎలాంటి ఫలితాలను రాబట్టారో ఎన్నికల ఫలితాలను
బట్టి అర్థం చేసుకోవచ్చునని థాక్రే తెలిపారు. మధ్యప్రదేశ్‌లో కూడా స్వతంత్ర్యులు, స్థానిక పార్టీల అండతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వుందని థాక్రే వ్యాఖ్యానించారు. 
 
రాహుల్ గాంధీ గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లోనూ అదరగొట్టారని.. ఒక్కడైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని.. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రవర్తనతో బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిందని మండిపడ్డారు.

గత నాలుగేళ్లలో అమిత్ షా, మోదీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసారని.. ప్రజల ఆదరణను కోల్పోయారన్నారు. సమర్థతతో కూడిన ప్రజాభీష్ట పాలన చేయడంలో బీజేపీ సర్కారు విఫలమైందని రాజ్ థాక్రే ఫైర్ అయ్యారు.