శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (15:03 IST)

తెలుగు పప్పుకు జోడీగా రాహుల్ పప్పు వచ్చి చేరారు-రోజా

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు పప్పు నారా లోకేష్‌కి తోడుగా రాహుల్ పప్పు వచ్చి చేరారని విమర్శించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును రోజా తప్పుబట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పని అయిపోయినట్టేనని రోజా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ.. ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన వీణ వాయించుకుంటూ కూర్చోవాలన్నారు. 
 
విపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం జరిగితే వెకిలి నవ్వులు నవ్వుతున్నారని రోజా మండిపడ్డారు. గత ఎన్నికల్లో తమ అధినేత జగన్మోహన్‌ని గెలవకుండా చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారన్నారు. ప్రజలను మోసం చేసి చంద్రబాబు గద్దెనెక్కారని రోజా ఆరోపించారు. ఎన్నికల్లో చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదన్నారు. 
 
జగన్‌కు పాదయాత్రలో వస్తున్న స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని రోజా ఆరోపించారు. పలు కేసులున్న క్రిమినల్‌ని ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో పెట్టుకున్నారని.. దాడి తర్వాత విపక్ష నేత జగన్‌పై టీడీపీ నేతలు ఎలా మాటల దాడి చేశారో ప్రజలు అందరూ చూశారన్నారు.