శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (08:50 IST)

ఆ వ్యాధితో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మృతి

కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 59 యేళ్లు. ఆదివారం అర్థరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. అనంత్ కుమార్ గతకొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చారు. 
 
గత అక్టోబరు 20న లండన్ నుంచి వచ్చిన ఆయన బెంగళూరులోని శంకర్ కేన్సర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బెంగళూరులోని అతని స్వగృహంలోనే ఆయన తనువు చాలించారు.
 
ఆయన కర్ణాటక బీజేపీకి అధ్యక్షుడుగా పనిచేశారు. అనంత్ కుమార్ ఆరుసార్లు దక్షిణ బెంగళూరు స్థానం నుంచి పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం అనంత్ కుమార్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.