శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (20:31 IST)

Mars పైన అద్భుతం: 25 కెమేరాలు, 2 మైక్రోఫోన్లతో అరుణ గ్రహంపై ల్యాండింగ్

ఫోటో కర్టెసీ-నాసా
అరుణ గ్రహంపై ఇదివరకు జీవం వుందేమో అనే విషయాన్ని తెలుసుకునేందుకు నాసా పర్సెవరెన్స్ రోవర్ ను విజయవంతంగా ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. ల్యాండింగ్ సమయంలో రోవర్ తీసిన ఫోటోలను ఇప్పటికే నాసా షేర్ చేసింది.
 
తాజాగా మంగళవారం నాడు రోవర్ అంగారక గ్రహంపై ఎలా కాలు మోపిందన్న వీడియోను షేర్ చేసింది. రోవర్ క్రమంగా ల్యాండ్ అవుతున్న సమయంలో అరుణ గ్రహంపై దుమ్ము లేవడంతో పాటు తాళ్ల సాయంతో వ్యోమనౌక నుంచి రోవర్ విడిపోయి అరుణ గ్రహంపై దిగడాన్ని వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. కాగా ఈ రోవర్ లోపల 25 కెమేరాలతో పాటు రెండు మైక్రోఫోన్లను ఇంజనీర్లు అమర్చారు.
 
రోవర్ అంగారక గ్రహంపై దిగుతున్న సమయంలో రోవర్ లోని 7 కెమేరాలను స్విచ్ ఆన్ చేసారు ఇంజినీర్లు. తాజాగా వీడియోను షేర్ చేసిన నాసా మరికొన్ని ఆసక్తికర అంశాలను త్వరలోనే షేర్ చేస్తామని తెలిపింది. చూడండి ఆ వీడియోను..