గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (18:52 IST)

భారత్‌లో వెలుగు చూసిన కొత్త రకం పోలియో వైరస్!

poliodrops
భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ, ఇపుడు పోలియో వైరస్ వెలుగు చూసింది. పోలియో రహతి దేశంగా గత 2014లో ప్రకటించారు. అప్పటి నుంచి మన దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో పోలియో కొత్త వైరస్‌ను గుర్తించినట్టు బెంగాల్ ఆరోగ్య శాఖను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించింది. యూనిసెఫ్ నిర్వహించిన అధ్యయనంలో పోలియో వైరస్ రూపాంతరం వెలుగు చూసినట్టు సమాచారం. 
 
బెంగాల్ రాష్ట్రంలోని హౌరాలో 2011లో 12 యేళ్ళ బాలికకు పోలియో వైరస్ సోకింది. ఆ తర్వాత యునిసెఫ్‌తో కలిసి ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన అధ్యయనాల్లో ఈ వైరస్ రూపాంతరం చెందినట్టు తెలింది. దీంతో అన్ని వైద్య కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులను అప్రమత్తం చేసింది. 
 
నిజానికి కోల్‌కతా, ముంబై వంటి మురికివాడల్లో ఇటువంటి అధ్యయనాలు జరుగుతూ ఉంటాయి. ఇపుడు కోల్‌కతాలోని మెటియాబురుజ్ ప్రాంతంలోని మురికివాడలో ఈ వైరస్ రూపాంతరం కనిపించడంతో, బహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాదని ఈ ప్రాంతవాసులను ఆదేశించారు. 
 
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న బాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్ని ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలకు ఆదేశాలు ఇచ్చారు. టీకాకరణపై కూడా దృష్టి సారించాలని ఆదేశించారు.