గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

రాహుల్ రామకృష్ణను ఏకేసిన నెటిజన్లు.. ఎందుకో తెలుసా?

rahul ramakrishna
ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో 300 మంది వరకు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతిలో కూరుకుపోయింది. 
 
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్లు విమర్శలకు దారితీశాయి.
 
ఇందుకు కారణం అతను రైలు ఎదుట విన్యాసాలను పోస్ట్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వీడియోలు ట్వీట్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
సైలెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటుడు బస్టర్ కీటన్ రైలు ముందు చేసే విన్యాసానికి సంబంధించిన వీడియోలను షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు ఏకిపారేశారు. 
 
వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ఇలాంటి వీడియోలేంటి అంటూ ప్రశ్నించారు. దీంతో రామకృష్ణ క్షమాపణలు చెప్పారు.