గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (21:38 IST)

అల్లం, వెల్లుల్లి, ధనియాలు.. గుండెపోటుకు సరిపడవు.. దీపక్ కృష్ణమూర్తి

Dr Deepak Krishnamurthy
Dr Deepak Krishnamurthy
గుండెపోటును నియంత్రించడానికి ఏదో భంగిమలో కూర్చోవడం.. అల్లం, వెల్లుల్లి, ధనియాలను నమలడంతో పాటు దగ్గు, తుమ్ములు, నవ్వులతో గుండెపోటును నియంత్రించవచ్చునని తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 
 
గుండెపోటును నియంత్రించేందుకు ఏదో భంగిమను ఉపయోగించడం.. అల్లం, వెల్లుల్లి, ధనియాలను నమలడం వంటివి చేయడంతో మంచి ఫలితం వుంటుందని ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోందని.. ఇవన్నీ గుండెపోటును నియంత్రించేందుకు సాయపడవని స్పష్టం చేశారు. గుండెపోటు లక్షణాలైన ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం, విపరీతంగా చెమటపట్టడం జరిగితే వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ కావాలని సూచించారు. 
 
అల్లం వెల్లుల్లి ధనియా వీటిలో ఏవీ గుండెపోటును నియంత్రించేందుకు సహాయపడవు. ప్రాణాలను కాపాడేందుకు #Heartattackకు తగిన చికిత్స పొందడానికి వీలైనంత త్వరగా కార్డియాక్ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి చేరుకోవాలని చెప్పారు. 
 
అక్కడ వైద్యులు ఇచ్చే ఇంజెక్షన్స్, మాత్రలు వాడటం.. వైద్యుల అబ్జర్వేషన్‌లో వుండటం.. ఆపై అవసరమైతే.. ఆంజియో ప్లాస్ట్, ఆంజియోగ్రామ్ వంటి చికిత్సలు తీసుకోవాలని సూచించారు. అంతేగానీ, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వీడియోలలో వుండే విధంగా అల్లం రసం తాగడం, వెల్లుల్లిని నమలడం వంటి వాటితో గుండెపోటును నియంత్రించలేమని స్పష్టం చేశారు.