మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 జనవరి 2021 (11:57 IST)

తొలి కరోనా టీకా ప్రధాని మోదీ తీసుకున్నాకే మేము సూది పొడిపించుకుంటాం, ఎవరు?

ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సిన్ సిద్ధమైనట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టీకాను ప్రజలకు అందించేందుకు మొదటి డ్రై రన్ ముగిసింది. రెండో డ్రై రన్ కూడా నిర్వహించనున్నారు. మరో నాలుగైదు రోజుల్లో దేశ వ్యాప్తంగా టీకాను ప్రజలకు వేయనున్నారు.
 
ఐతే ఈ టీకా పనితీరుపై ఆర్జేడీ అనుమానం వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ పైన ప్రజలకు పూర్తి నమ్మకం కుదరాలంటే తొలుత ప్రధానమంత్రి మోదీ ఆ టీకాను తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఆయన వేయించుకున్న తర్వాతే తాము కూడా కరోనా వ్యాక్సిన్ సూది పొడిపించుకుంటామని ఆర్జేడీ నేక తేజ్‌ప్ర‌తాప్ పేర్కొన్నారు.
 
కాగా భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. దేశంలోని 130 కోట్ల మందికిపైగా ప్రజలకు టీకాను అందించే దిశగా, తొలి అడుగులు పడుతున్నాయి. తొలి విడత వ్యాక్సిన్‌ను పంపుతున్నామని, దాన్ని ఫ్రంట్ లైన్ యోధులకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ, ఏపీ సహా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రంనుంచి సమాచారం అందింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ అడ్వయిజర్ డాక్టర్ ప్రదీప్ హల్దేర్, లేఖలను పంపారు.
 
రెండో దశలో ఇందుకు సంబంధించిన విధివిధానాలతో కూడిన సూచనలను పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలకు వ్యాక్సిన్‌సిద్ధంగా ఉండాలని అన్నారు. రిజిస్టర్ చేసుకున్న వారికి తొలుత ఇవ్వాలని, ఆ సంఖ్య ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని టీకాలు పంపాలన్న విషయమై ముందుగానే ఓ అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు.
 
మరోవైపు, శుక్రవారం కూడా మరో విడత దేశవ్యాప్త టీకా డ్రైరన్ కొనసాగనుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ, టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్ల గురించి అవగాహన తెచ్చుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. నేడు 33 రాష్ట్రాల్లోని 746 జిల్లాల్లో డ్రైరన్ సాగనున్నదని, దీన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.