మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 మార్చి 2022 (19:52 IST)

హరహరమహాదేవ శంకర, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగిపోవాలని ప్రార్థించండి, ప్లీజ్: ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా

రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం మరింత తీవ్రమైతే అనేక ఇతర దేశాలు కూడా ఇందులో పాల్గొనే అవకాశం వుంది కాబట్టి ప్రపంచవ్యాప్త సంక్షోభం ఏర్పడుతుందని ప్రపంచం మొత్తం భయపడుతోంది. భారతదేశంతో సహా ఇతర దేశాల ప్రజలు ఈ సంక్షోభాన్ని నివారించాలని ప్రార్థిస్తున్నారు. భారతదేశంలో ఉన్న ఉక్రెయిన్ రాయబారి భారతదేశంలో ఉన్న శివ భక్తులు ఈ యుద్ధాన్ని నివారించడానికి శివుడిని ప్రార్థించాలని విజ్ఞప్తి చేసారు.

 
ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... భారతదేశంలో ఈరోజు మహాశివరాత్రి పండుగ అని చెప్పారు. ఈ యుద్ధం ముగియాలని మీరంతా శివుడిని ప్రార్థించాలని నా విజ్ఞప్తి. ఉక్రెయిన్ ప్రజలు ఈ సంక్షోభం నుండి బయటపడగలరని కూడా ఆయన అన్నారు.

 
ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపై మీడియాతో మాట్లాడుతూ ఇగోర్ పొలిఖా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. ఉక్రెయిన్‌లో ప్రతి రాత్రి కాల్పులు జరుగుతున్నాయని, అన్ని వైపుల నుండి కాల్పులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని, విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

 
గతంలో ఇగోర్ పొలిఖా ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌కు పెద్ద హోదా ఉందని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకుంటారని భావిస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం మహాశివరాత్రి నాడు ఇగోర్ పొలిఖా శివ భక్తులకు చేసిన విజ్ఞప్తి వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇక్కడ చూడండి.