శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (13:06 IST)

భారత్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న చేస్తున్న ఉక్రెయిన్

ఉక్రెయిన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఐక్యరాజ్య సమితిలో జరిగే ఓటింగ్‌లో భారత్ పాల్గొని ఓటు వేయాలని కోరింది. ఈ విషయంలో ఉక్రెయిన్‌లోని భారత పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించింది. ఇదే విషయంపై ఐక్యరాజ్య సమితిలో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి నిధి సెర్గీ కైస్లస్త్య ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
"నేను కొందరికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. మా దేశంలో ఉన్న మీ దేశ పౌరుల భద్రతకు సంబంధించిన అంశం. వారి భద్రత కోసం మీరు ఓటింగ్‌లో ముందుండాలాల్సిందే. ఓటు వేయాలా వద్దా అని మీనమేషాలు లెక్కించవద్దు. ఎందుకంటే మీ పౌరులు క్షేమం మీకు ముఖ్యం. మా దేశంలో ఉన్న మీ దేశ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకోండి. ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో జరిగే ఓటింగ్‌లో పాల్గొనండి" అంటూ బ్లాక్ మెయిలింగ్ చేసేలా వ్యాఖ్యలు చేశారు.